`విక్రమ్` జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల

కమల్ హాసన్ కథా నాయకుడి గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చిత్రం  `విక్రమ్` జూన్ 3 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో  అత్యంత భారీ అంచనాల తో కూడిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. ఆసక్తికరమైన ప్రచారంతో ఈ చిత్రం అంచనాలను పెంచింది.
విడుదల తేదీ తో పాటు మేకింగ్ గ్లింప్స్ ని కూడా  మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
 ఇప్పుడు విడుదల సమయం వచ్చేసింది. అందుకే చిత్ర బృందం సినిమా విడుదల తేదీని ప్రకటించింది. విక్రమ్ జూన్ 3న థియేటర్లలోకి రానున్నారు. జూన్ 3, 2022న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే మా “విక్రమ్” కోసం నేనూ ఆతృతగా ఎదురుచూస్తున్నాను. #VikramFromJune3 ,” అని కమల్ హాసన్ ప్రకటించారు.
కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ త్రయాన్ని శక్తివంతమైన పాత్రలలో చూపించే మేకింగ్ గ్లింప్‌ను కూడా వారు ఆవిష్కరించారు. అనిరుధ్ రవిచందర్ తన బిజిఎమ్‌తో వీడియోకి థ్రిల్ ఫీల్‌ని ఇచ్చాడు.
విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటిస్తుండగా, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కూడా.
స్టార్ కాస్ట్‌తో పాటు, ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, నరైన్, మరియు శివాని నారాయణన్ కూడా సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.
విక్రమ్  సాంకేతిక బృందంలో కంపోజర్ అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రాఫర్ గిరీష్ గంగాధరన్ మరియు ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు.
తారాగణం: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్ , శివాని నారాయణన్ మరియు ఇతరులు
సాంకేతిక సిబ్బంది: దర్శకుడు: లోకేష్ కనగరాజ్‌ని, ర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్బ్యా, నర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్సం, గీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్ఎ, డిటర్: ఫిలోమిన్ రాజ్పి, .ఆర్.ఓ.-వంశీశేఖర్

Previous articleCelebrate the magic of Indian Cinema with RRR Movie from March 25th
Next articleLatest Photos YUKTI THAREJA