ఏ ‘దానం’ వలన ఉపయోగాలు

ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలది చేసే ద్రవ్యసహాయము కానీ, వస్తు సహాయమును కానీ..‘ధర్మం’ అంటారు. ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది
‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. నీకు తోచినది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలాచేయడానికి మీరు సిద్ధంగాఉన్నా తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్ర నియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి. వాటినే ‘దశ దానాలు’ అంటారు.

ఇవి మొత్తం పది దానాలు.
గో భూ తిల హిరణ్య ఆజ్య వాసౌ ధాన్య గుడానిచ
రౌప్యం లవణ మిత్యాహుర్దశదానాః ప్రకీర్తితాః

దూడతో కూడుకున్న ఆవు, భూమి, నువ్వులు, బంగారము, ఆవునెయ్యి, వస్త్రములు, ధాన్యము, బెల్లము, వెండి, ఉప్పు… ఈ పదింటిని దశ ధానములుగా శాస్త్రం నిర్ణయించింది. వీటినే మంత్ర పూర్వకంగా దానం చెయ్యాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. మరి, ఏ ఏ దానంవల్ల ఏ ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి..

Previous articleఏపీ ఆర్థిక పరిస్థితి పై ఆనం ఘాటైన వ్యాఖ్యలు !
Next articleమెరిసే చర్మం కోసం ‘ఫేస్ ప్యాక్’