బుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా…!

అవును. కానీ కాదు.
అవును: బుద్ధ అనే పేరుతో శ్రీహరి అవతారం ఉంది.
కాదు: ఆ బుధ్ధ అవతారం కలియుగంలో గౌతమ బుద్ధుడిగా మారిన సిద్ధార్థుడు మాత్రం కాదు.
అసలు ఆ అవతారం పేరునే బౌద్ధమతం స్థాపించేముందు బుద్ధుడు పెట్టుకున్నాడు. తెలియనివాళ్ళు 10అవతారాల్లో ఒకడు గౌతమబుద్ధుడు అని కలిపేస్తుంటారు. వాళ్లకు ఇది వివరంగా చెప్పండి.
అసలు శ్రీమహావిష్ణువు కేవలం 10 అవతారాల్లోనే వచ్చాడా ? కాదు.
ఏక వింశతి అంటే 21 శ్రీమహావిష్ణువు అవతారాలు :
దశావతారాలు ముఖ్యమైనవి అని మనకు పెద్దలు చెప్పారు కానీ పది అవతారాలు మాత్రమే అని కాదు. ఎన్నోసార్లు ఎన్నో యుగాల్లో శ్రీమహావిష్ణువు తాత్కాలికంగా కూడా లోకకళ్యాణార్ధకార్యాలకై భువిపైకి వేంచేశాడు.
“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్..!!
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”
ధర్మమునకు హాని కలిగినప్పుడును, ఆధర్మము పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడును
(జన్మ కర్మ రహితుడనైనప్పటికిని) నన్ను నేను సృజించుకొందును.
సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిరమొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును.
భగవద్గీత నాల్గవ అధ్యాయము – జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రకారం భగవానుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం అవతారాలు దాల్చాడు..
వాటిలో దశావతారాలు ప్రసిద్ధమైనవి ..
దశావతారాలతో ఏకవింశతి అవతారాలు కలవు వాటి గురించి తెలుసుకుందాం..!!
పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి.
అవి: 1. మత్స్యావతారము

2. కూర్మావతారము

3. వరాహావతారము

4. నృసింహావతారము లేదా నరసింహావతారము

5. వామనావతారము

6. పరశురామావతారము

7. రామావతారము

8. కృష్ణావతారము

9. వెంకటేశ్వరావతారము
10. కల్కివతారము
బుద్ధుడు మరియు బలరాముడు విష్ణువు యొక్క అవతారములని ప్రతీతి.
ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు.
(బుద్ధుడు అంటే బౌద్ధ మత ప్రబోదకుడైన బుద్ధుడు కాదు)
మహాభాగవతం ప్రధమ స్కంధంలో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి.
అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి.
ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.

Previous articleఅఖండకు అభిమానుల నీరాజనాలు
Next articleఏపీ ఆర్థిక పరిస్థితి పై ఆనం ఘాటైన వ్యాఖ్యలు !