అఖండకు అభిమానుల నీరాజనాలు

నటసింహం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘అఖండ’. భారీ బడ్జెట్తో ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించాడు. ఇది డిసెంబర్ 2న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఇలా తాజాగా ఇది వంద రోజులు పూర్తి చేసుకుంది.
యావత్ భారతదేశాన్ని ‘అఖండ’ సినిమా తల ఎత్తుకునేలా చేసిందన్నారు నందమూరి బాలకృష్ణ. కరోనా సమయంలో తీసినా.. భారీ విజయం సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా 100 రోజులు పూర్తి చేసుకన్న సందర్భంగా కర్నూల్లో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు.
‘అఖండ’ ప్రారంభించినప్పుడు ఒక మంచి మనసుతో తీశాం. నా ప్రతి సినిమా ఆలోచన రేకించేదే. హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం ‘అఖండ’. ధర్మం జోలికి, పసిపాపల జోలికి వెళ్లరాదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా అందించాం. సహజమైన సినిమాలతో భారీ హిట్ సాధించడం చాలా గొప్పదనం. యావత్ భారత దేశాన్ని ఈ సినిమా తల ఎత్తుకునేలా చేసింది.”
‘అఖండ’ చిత్రానికి తమన్ ఆణిముత్యాలు లాంటి పాటలు అందించారని ప్రశంసించారు బాలకృష్ణ. ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లారని కొనియాడారు. దర్శకుడు బోయపాటితో ఎప్పుడూ చరిత్ర తిరగరాసే చిత్రాలనే చేస్తున్నట్లు చెప్పారు. చలనచిత్ర పరిశ్రమకు దిక్సూచిగా ‘అఖండ’ నిలిచిందని పేర్కొన్నారు. ఇక తన పేరిట సేవా కార్యక్రమాలకు చేస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేశారు బాలయ్య. వారే తనకు వెలకట్టలేని ఆస్తి అని కొనియాడారు.

Previous articleయూపీ టు ఏపీ బీజేపీ కొత్త నినాదం !
Next articleబుద్ధుడు విష్ణుమూర్తి అవతారమా…!