సహజంగా దొరికే కొన్ని పండ్లు పై ఉన్న తొక్కును తీసి పడేస్తాము. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, అవి ఎందుకూ పనికిరావు చెత్త అనుకోని పడేస్తూ ఉంటారు. కానీ వాటిలో కూడా మన చర్మాన్ని కాపాడే గుణం ఉంది, అది ఏమిటీ ఎలాగో తెలుసుకుందాం..
సౌదర్యం కోసం చర్మ సంరక్షణ కోసం సహజంగా మార్కెట్లో దొరికే అనేక వాటిపై ఆదరపడతారు. మార్కెట్లో దొరికే వాటిల్లో ఎన్నో వాటిని ఇంట్లో ఉపయోగించుకొనే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే రసాయనాల ప్రభావం వల్ల ఇబ్బందులు పడటమే కాక చర్మం పాడుచేకోవడం కన్నా ఇంట్లోనే ‘ఫేస్ ప్యాక్’ తయారుచేసుకోవచ్చు.
అన్ని ప్రాంతాల మార్కెట్లో నారింజ, నిమ్మ విరివిగా దొరుకుతాయి. మనకు దొరకవు అనే సందేహం కూడా ఉండదు. ఆ పండ్ల పై ఉన్న తోకలలోని ‘మిటమిన్ సి’ పుష్కలంగా ఉంటాయి కాబట్టి చర్మ సంరక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. తొక్కల్ని నేరుగా ఉపయోగించె కన్నా ఈ తొక్కల్ని ఎండలో ఎండబెట్టి పొడి చేసి పౌడరు రూపంలో ఉపయోగించుకోవాలి