ఆంధ్ర ప్రదేశ్ లో మరో రెండు కొత్త రాజకీయ పార్టీలు ?

ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైసిపి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది, కానీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఇంకా బలంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. కనీసం ఆంధ్రప్రదేశ్‌లో రెండు రాజకీయ పార్టీలు రాబోతున్నాయి.
మొదటిది బ్రదర్ అనిల్ కుమార్ ,మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సమావేశమైన ఆయన ఆ తర్వాత రాజమండ్రి,విజయవాడ రెండు ప్రాంతాల్లోనూ బీసీలతో సమావేశమయ్యారు.రెండు చోట్లా రాజకీయాలు తెరపైకి వచ్చాయి.వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాల మధ్య ఈ చర్చలు జరిగాయి.
ఇదిలా ఉంటే కాపు సామాజికవర్గ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. వైజాగ్, హైదరాబాద్, తాడేపల్లిలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.మాజీ డీజీపీ సాంబశివరావు, మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్‌, గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా సహా సంఘం నేతలు రాజకీయ అధికారం, సరైన ప్రాతినిధ్యం సామాజికవర్గానికి ముఖ్యమని భావిస్తున్నారు.కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
కాపులు తమ సమస్యలను చెప్పుకునేందుకు ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పొలిటికల్ ఫీవర్ హీట్ పెరిగిపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది . ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఒక్కసారిగా యాక్టివ్‌గా మారాయి.ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 15 శాతంగా ఉన్న కాపు వర్గానికి సరైన ప్రాతినిధ్యం లభిస్తుందా? జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని వైఎస్ షర్మిల తట్టిలేపగలరా? లేదా ? ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

Previous articleసంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు
Next articleఉద్యోగ నోటిఫికేషన్ పై పీకే సలహా కేసీఆర్ విన్నారా?