చిన్ని గుండెకు మహేష్ బాబు అండ

వెండితెర మీదే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు మహేష్ బాబు. పేద కుటుంబములోని చిన్నారుల కోసం వారిని ఆదుకోవడానికి రేయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ మహేష్ బాబు ప్రారంభించాడు. ఈ హాస్పిటల్ లో నా కుమారుడు గౌతమ్ కృష్ణ ఇక్కడే జన్మించినాడు. అప్పుడు నుండి నాకు ఈ హాస్పిటల్ కు నాకు మంచి సంబంధం ఉందన్నారు.
ఇక పై మహేష్ బాబు ఫౌండేషన్, ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కలసి పనిచేస్తాయి అని మహేష్ బాబు చెప్పారు. ఇందులో భాగంగా మొదట 125 మంది చిన్నారుల గుండె శస్త్ర చికిత్సలకు అవసరమయ్యే ఖర్చు భరిస్తానని మహేష్ బాబు తెలిపారు. గతంలో కూడా చాలా మంది చిన్నారులకు గుండె శస్త్ర చ్చకిత్సలు చేయించి చిన్నారుల ప్రాణాల్ని కాపాడాడు.
చిన్నపిల్లలకు సాయపడటంలో ఎప్పుడూ ముందుంటారు సూపర్‌స్టార్ మహేశ్ బాబు.
మహేశ్‌బాబు ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు వేల మంది పేద పిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. రెయిన్బో హాస్పిటల్స్, ఆంధ్రా హాస్పిటల్స్ భాగస్వామ్యంతో గతేడాది తన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ప్రజలందిరికీ ఉచితంగా కొవిడ్ టీకాలు వేయించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.
తాజాగా.. మహేశ్ బాబు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు . ‘మహేశ్‌బాబు ఫౌండేషన్’ ‘రెయిన్బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్'(ఆర్సీహెచ్ఐ) భాగస్వామ్యంతో ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్(పీఎల్‌హెచ్‌ఎఫ్)ను ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్‌లో భాగంగా.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా చికిత్స అందించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్‌బాబు.. ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఈ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. పిల్లలు ఎప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటారు. చిన్న పిల్లల హృదయాలకు ఎక్కువ కేర్ తీసుకోవాలి అని అన్నారు. అంతేగాక ‘హీల్ ఏ చైల్డ్’ అనే సంస్థతోనూ మహేష్ బాబు ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఉంది. ఈ సంస్థ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా వైద్య సాయం అందిస్తోంది .

Previous articleవెలవెలబోతున్న తెలంగాణ టిడిపి కార్యాలయం !
Next articleవైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న 40 మంది ఎమ్మెల్యేలు ?