బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారా?

వృత్తిరీత్యా క్రైస్తవ మత ప్రబోధకుడు అయిన వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ గతంలో వైఎస్ఆర్, వైఎస్ జగన్ గెలుపు కోసం ఎనలేని కృషి చేశారన్నది బహిరంగ రహస్యం. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత, ఆయన వివిధ వ్యక్తులను కలుస్తూ విశ్లేషణలు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇది ఇలా ఉండగా బ్రదర్ అనిల్ కుమార్ విజయవాడలో కొంతమంది బీసీ నాయకులతో సమావేశమయ్యారు. సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. బ్రదర్ అనిల్ కుమార్, బీసీ నేతల మధ్య జరిగిన భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయో తెలుసుకోవాలని అందరి దృష్టి సమావేశంపైనే ఉంది. సిఎం జగన్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ పెట్టాలని బ్రదర్‌ని కోరినట్లు తెలుస్తోంది , వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బిసి నేతలను పక్కన పెట్టారనేది దావానలంలా వ్యాపిస్తున్న వార్త. ఎన్నికల తర్వాత బీసీ నేతలను పక్కన పెట్టారని వారు చెబుతున్నారు. రాష్ట్రంలో బ్రదర్ అనిల్ కుమార్ రాజకీయ పార్టీని తేవాలని కోరుతున్నారు. మీ మాటలు విని జగన్‌కు ఓటేశాం. అందుకు ప్రతిగా మమ్మల్ని పట్టించుకోలేదని వారు ఆరోపించారు. బీసీ నేతల అభ్యర్థనల మేరకు బ్రదర్ అనిల్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తే.. వైసీపీ రాజకీయంగా ఇబ్బంది పడక తప్పదు. వైసిపి ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. సీఎం జగన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా అనిల్‌ రాజకీయ పార్టీ ఏర్పాటుపై ముందడుగు వేస్తారా ? లేదా ? అనేది తెలియాలి. అదే జరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను పరిణామం కావడం ఖాయం.

ఇప్పుడు అటువంటి ఆలోచన లేదు: అనిల్

 రాష్ట్రంలో కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని బ్రదర్ అనిల్ ఖండించారు. ఇప్పుడు అటువంటి ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.
పార్టీ అంశం మొత్తం ఊహాగానాలేనని ఆయన అన్నారు. ఏమైనా ఉంటే.. తాను మీడియా ముందుకు వచ్చి వివరాలను వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ సంఘాలతో వైఎస్సాఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల భర్త బ్రదర్ అనిల్ సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం దాదాపు రెండు గంటలపాటు సాగింది. త్వరలో కొత్త పార్టీ ప్రకటించే ఆలోచనలో బ్రదర్‌ అనిల్ ఉన్నాడని ఆ వర్గాలు పేర్కొన్నాయి. జగన్, వైసీపీ వ్యతిరేక వర్గాలతో బ్రదర్‌ అనిల్ మంతనాలు జరిపారు.

Previous articleవైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న 40 మంది ఎమ్మెల్యేలు ?
Next articleసినిమా టిక్కెట్ రేట్ల ఫైలుపై సంతకం చేసిన జగన్!