వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్న 40 మంది ఎమ్మెల్యేలు ?

వైఎస్సార్‌సీపీలో పరిస్థితి అంతా బాగాలేదా..? అంటే.. అవుననే.. అంటున్నారు అసంతృప్త ఎమ్మెల్యేలు. పార్టీపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గట్టి పట్టు ఉన్నప్పటికీ, అనేక మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు పార్టీపైనా, అధినేతపైనా విరుచుకుపడేందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి.
కేవలం పెద్దలకే పార్టీలో పరిమితమయ్యారనే భావన పలువురు ఎమ్మెల్యేల్లో పెరుగుతోంది. పథకాల రూపకల్పన,అమలు,లబ్దిదారుల ఎంపికలో వారి పాత్ర నామమాత్రమే.కేవలం జగన్ చరిష్మా వల్లే కాకుండా తమ వ్యక్తిగత ప్రభావం, కృషి వల్లే తాము గెలిచామని భావిస్తున్న ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంది.
కనీసం 30 శాతం మంది ఎమ్మెల్యేలు తమ తమ సొంత ఇమేజ్ పై ఎన్నికల్లో గెలిచామని కేవలం వైఎస్ జగన్ ఇమేజ్ వల్ల కాదని తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు రావడం లేదని ఎమ్మెల్యేలు వాపోయారు. రోడ్డు మరమ్మతులు వంటి చిన్న చిన్న పనులు కూడా చేయించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ఏ విషయంలోనూ తమను సంప్రదించడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల నియామకం నుంచి వివిధ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక వరకు తమ ప్రమేయం లేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసేందుకు అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
2024 ఎన్నికలకు ముందు కనీసం 40 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీని విడిచిపెట్టాలని భావిస్తున్నారట. జిల్లాల ఏకపక్ష విభజనపై పలువురు ఎమ్మెల్యేలు కూడా మండిపడుతున్నారు. తమ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలను ఇతర జిల్లాల్లోకి చేర్చడం వల్ల వచ్చే ఎన్నికల్లో తమ అవకాశాలకు గండి పడుతుందని భావిస్తున్నారు.ముందు ముందు వైసీపీ పార్టీలో ఏం జరగనుందో చూడాలి

Previous articleచిన్ని గుండెకు మహేష్ బాబు అండ
Next articleబ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారా?