హైదరాబాద్‌లో ఖరీదైన స్థలం కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్ !

సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ పవన్ కళ్యాణ్కు హైదరాబాద్‌లో సొంత ఇల్లు, పెద్ద ఫామ్‌హౌస్‌ ఉన్నాయి. ఇటీవల తన ఇంటికి సమీపంలోనే ఓ ఆఫీస్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. వీటికి తోడు హైదరాబాద్‌లోని ఒక ప్రధాన ప్రదేశంలో 1200 చదరపు గజాల స్థలాన్ని కూడా కొనుగోలు చేశాడు.
ఆ ప్రాంతంలో చదరపు గజానికి రూ.2 లక్షలు విలువ ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్లాట్ ధర సుమారు 24 కోట్లు ఉంటుందంటున్నారు. ఖ్వాజాగూడ ప్రాంతం కొత్తగా అభివృద్ధి చేయబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అక్కడ ఓ ప్రముఖ స్కూల్ ఎదురుగా పవన్ ఈ ప్లాట్‌ని సొంతం చేసుకున్నారు.
అతను చాలా సినిమాలు చేస్తున్నాడు. వరుస సినిమాలకు అడ్వాన్స్‌లు తీసుకుంటున్నాడు. తనకు నలుగురు పిల్లలు ఉండడంతో ఆస్తులు కొనుగోలు చేసే పనిలో పడ్డాడు.

Previous articleతెలంగాణలో పీకే వ్యూహాలు బీజేపీకి ఉపయోగపడుతున్నాయా?
Next articlevarusarath5 garu a Happiest Birthday!