49 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు టీడీపీతో టచ్‌లో ఉన్నారు !

వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉన్నారని, ప్రస్తుత సీఎం జగన్‌కు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని నటుడు శివాజీ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు అనంతరం అమరావతి రైతుల విజయోత్సవ సభకు శివాజీ అతిథిగా హాజరయ్యారు.
అమరావతి రైతులు, మహిళలు చేసిన నిరసన చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నిర్ణయాన్ని నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను, అయితే ఈ విజయం మహిళలదేనని, వారికి తలవంచి నమస్కరిస్తున్నానని శివాజీ అన్నారు.
అనంతరం శివాజీ రాజకీయాలపై మాట్లాడుతూ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల వల్ల రాజకీయాలు కలుషితమవుతున్నాయన్నారు.
‘ప్రత్యేక హోదా’ పై ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, ‘మూడు రాజధానులు’ ఎజెండాతో వచ్చే ఎన్నికలకు వెళ్తారు కానీ అమరావతి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. అయినా జగన్ ఎన్నికల్లో ఓడిపోతారు’’అని శివాజీ అన్నారు.
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల నుంచి డబ్బులు తీసుకోవాలని, అయితే స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాసేవలో ఉండే నిజాయితీ గల నాయకుడికి ఓటు వేయాలని శివాజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అయితే వైసీపీకి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారా? ఎన్నికల వేళ సీరియస్ గా జంప్ చేస్తారా? శివాజీ అన్నారంటే.. అందులో ఎంతోకొంత నిజం ఉండే ఉంటుంది. గతంలో 2019 ఎన్నికలకు ముందు ఆపరేషన్ గరుడ పేరుతో శివాజీ చెప్పిన విషయాలు నిజమయ్యాయి. రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన విషయాలు ఎంత వరకు నిజమో అవుతాయో చూడాలి

Previous articleజీహెచ్‌ఎంసీ మేయర్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కార్పొరేటర్లు?
Next articleహను-మాన్‌ లో అంజమ్మ గా వరలక్ష్మి శరత్‌ కుమార్ ఫస్ట్‌ లుక్‌ను కిచ్చా సుదీప్ ఆవిష్కరించారు