కెసిఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత మూడు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు. ఏం సాధించాడు? ఇదీ తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రమంత్రులు ఎవర్ని కేసీఆర్ కలవలేదు. ఆయన న్యూఢిల్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతలను ఎవరినీ కలవలేదు . కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కలిశారు. ఆయనతో పాటు రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ కూడా కలిశారు. అయితే సుబ్రహ్మణ్యస్వామితో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పై చర్చించే అవకాశం లేదు. ఆయన బీజేపీలో తిరుగుబాటుదారుడని, పదవీ కాలం ముగిసిన తర్వాత మళ్లీ నామినేట్ అయ్యే అవకాశం లేదన్నది బహిరంగ రహస్యం. కాబట్టి స్వామి కలవడం వల్ల ఫలితం ఉండదు.
అలాగే రాజకీయాలతో సంబంధం లేని రాకేష్ టికాయత్ తో కూడా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ పై చర్చించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు ఉద్యమంలో (సాగు చట్టాలకు వ్యతిరేకంగా ) చనిపోయిన వారికి కేసీఆర్ నష్ట పరిహారం ప్రకటించారు. బహుశా వాటి పంపిణీ గురించి చర్చించి ఉంటారని భావిస్తున్నారు. చనిపోయన వారి లిస్ట్ను టికాయత్ వద్ద నుంచే తీసుకుంటానని కేసీఆర్ ప్రకటించారు. ఈ కారణంతో కేసీఆర్తో భేటీ జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు .ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేసీఆర్‌ను కలవడం సరికాదని భావించడం విశేషం. కేసీఆర్‌ను లంచ్‌కి కూడా పిలవలేదు.
నార్త్ ఇండియాలో కేసీఆర్‌కు అంత ప్రాధాన్యం లేదని స్వయంగా టీఆర్‌ఎస్ వర్గాలే చెబుతున్నాయి. డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, మహారాష్ట్ర వంటి పార్టీలు తమ తమ రాష్ట్రాల్లో 35 కంటే ఎక్కువ లోక్‌సభ స్థానాలను కలిగి ఉండగా, తెలంగాణలో కేవలం 17 లోక్‌సభ స్థానాలతో జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని టిఆర్ఎస్ సన్నిహిత వర్గాలు అంటున్నాయి .

Previous article40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గండిపేటలోనే !
Next articleరేవంత్ ఆరోపణలు ఖండించిన తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం !