రేవంత్ ఆరోపణలు ఖండించిన తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం !

బీహార్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఎఎస్ / ఐపిఎస్ అధికారులకు తెలంగాణలోని కీలక శాఖల (పోస్టింగ్) బాధ్యతలను ఇస్తున్నారని ఇస్తున్నారనే ఆరోపణలను ఐఎఎస్ / ఐపిఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఇది నిరాధారమైన ఆరోపణగా అసోసియేషన్ పేర్కొంది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)మహేందర్‌రెడ్డి తన ఇంటి వద్ద గాయాలపాలైన కారణంగా మెడికల్ లీవ్‌పై వెళ్లినట్లు స్పష్టం చేసింది. హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ సరిగ్గా నయం కావడానికి, అతనికి వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు అందువల్ల మహేందర్‌రెడ్డి ఫిబ్రవరి 18 నుండి మార్చి 4 వరకు మెడికల్ లీవ్‌పై కొనసాగుతున్నారు.
మహేందర్‌రెడ్డికి సంబంధించి వాస్తవాలు, తెలుసుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. “ఆయన మంచి ఆరోగ్యం , త్వరగా కోలుకోవాలని కోరుకునే బదులు, సదరు నాయకులు పబ్లిసిటీ కోసం అధికారిని అనవసరంగా వివాదంలోకి లాగారు అని ఐపీఎస్‌ అధికారుల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఐపీఎస్‌ అధికారి అంజనీ కుమార్ బీహార్‌ రాష్ట్రానికి చెందిన కొంతమంది ఐఏఎస్‌ అధికారులను లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రకటనలు భారత రాజ్యాంగం , అఖిల భారత సేవల నిబంధనల గురించి అవగాహన లేమిని ప్రతిబింబిస్తున్నాయని ఐపీఎస్‌ అధికారుల సంఘం పేర్కొంది.
ఆలిండియా సర్వీస్ అధికారులను ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ ప్రకారం నిర్దిష్ట రాష్ట్రానికి కేటాయిస్తారు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోస్టింగ్‌లు ఇస్తాయి. స్వీయ ప్రచారం కోసం అధికారులను అనవసరంగా వివాదంలోకి లాగడం వల్ల ఇటువంటి ప్రకటనలు అధికారులపై ప్రభావాన్ని చూపుతాయి, అని అసోసియేషన్ పేర్కొంది. అధికారులను , పోలీసులను నిరుత్సాహపరిచే ఉద్దేశ్యంతో అమాయక ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యంతో రాజకీయ నాయకులు కొందరు బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం అలవాటు చేసుకున్నట్లు కనిపిస్తోంది. వాస్తవాలను తెలుసుకోకుండా , భారత రాజ్యాంగం అందించిన నిబంధనల గురించి తెలుసుకోకుండా వ్యాఖ్యానించడం మానుకోవాలని ఐపీఎస్‌ అసోసియేషన్ ఈ రాజకీయ నాయకులను కోరింది.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు బీహార్‌లోనే మూలాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి బుధవారం అన్నారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల చేతుల్లో తెలంగాణ బానిసగా మారిందని ఆరోపించారు. బీహార్‌కు చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను కీలక పదవుల్లో నియమించి ఒక్కొక్కరికి 6-8 శాఖలు అప్పగించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత డీజీపీని సెలవుపై పంపి అంజనీకుమార్‌ను ముఖ్యమంత్రి డీజీపీని చేశారని ఆరోపించారు.

Previous articleకెసిఆర్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు ?
Next articleఅమరావతి పై జగన్ ఏం చేస్తారు ?