మూడు రాజధానులు పై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ !

అమరావతి రైతుల విజయం..
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. సి ఆర్ డి ఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది . సీఎం జగన్ కు ఊహించని షాక్ తగిలింది. ఏపీలోని మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దులపై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని.. ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. ఆరు నెలల్లో ఒప్పంద ప్రకారమే మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది .
రాజధాని అభివృద్ధి పనులపై హైకోర్టుకు ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లను అభివృద్ధి పరిచి అప్పగించాలని, రాజధాని అవసరాలకు తప్ప వాటికి భూమి తనకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ల ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని.. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. రాజధానిపై నిర్ణయాలు, చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది .807 రోజులకు అమరావతి రైతులు రాజధాని పై ఉద్యమం చేస్తున్నారు . ఇది అమరావతి రైతుల విజయంగా పలువురు నేతలు చెబుతున్నారు

Previous articleతన చెప్పుతో తనను కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి !
Next article40వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గండిపేటలోనే !