పవర్ స్టార్ ‘జేమ్స్’ మార్చి 17న విడుదల

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. మంచి తనానికి, మానవత్వానికి, కష్టానికి పేరున్న ఏకైక హీరో పునీత్ రాజ్ కుమార్. పునీత్ ను అభిమానులు ప్రేమతో అప్పు గా పూజిస్తారు, ఆరాధిస్తారు. పునీత్ ఆకస్మిక మరణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులకు తీరనిలోటు. అతడు చివరి చిత్రం జేమ్స్ తన జన్మదినం రోజు మార్చి 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నది.

ఈ సినిమా విడుదల సందర్భంగా మార్చి 17న ఇతర ఏ సినిమాలు విడుదల చేయకూడదని కర్ణాటక సినిమా ఇండస్ట్రీ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం కన్నడ స్టార్ పవర్ స్టార్ కి గొప్ప నివాళులు. తన అభిమాన హీరో చివరి చిత్రం ‘జేమ్స్’ విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. కన్నడంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు.

చేతన్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాలో పునీత్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించునున్నారు. పునీత్ కు జోడిగా ప్రియా ఆనంద్ నటించింది. చరణ్ రాజ్ సంగీతం అందించారు. తెలుగు రాష్ట్రాల్లో పునీత్ రాజ్ కుమార్ కు ఘనంగా నివాళ్ళు అర్పిస్తూ హీరో శ్రీకాంత్, విజయ్ ఎమ్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు అభిమానులకు గొప్ప సినిమాగా నిలిచిపోతుంది

Previous articleనెల్లూరు చిరకాల ప్రత్యర్థులు ఒక్కటవుతున్నారా?
Next articleరాజకీయాల నుంచి తప్పుకోనున్న జగన్ మేనమామ !