రాజకీయాల నుంచి తప్పుకోనున్న జగన్ మేనమామ !

పి. రవీంద్రనాథ్ రెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి స్వయాన బావమరిది. వివిధ పదవులు చేపట్టి ఎమ్మెల్యేగా ఎదిగారు. జిల్లా స్థాయి పదవులతో ప్రారంభించి, క్రమంగా పెద్ద ఎత్తున అడుగులు వేస్తూ చివరికి శాసనసభ్యుడిగా ఎదిగారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మామ.కమలాపురం ఎమ్మెల్యే తన రాజకీయ ప్రస్థానానికి తెర దించేందుకు సిద్ధమయ్యారు.
తన తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తన కొడుకును వచ్చే ఎన్నికల్లో కమలాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండడంతో ఎమ్మెల్యే తన కుమారుడిని రాజకీయంగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇందు
కోసం ఆయన తన కొడుకును అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చేస్తున్నారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన తాను రాజకీయాల్లో తప్పుకొని,తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని రవీంద్రనాథ్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు సమాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే త‌న కుమారుడి కోసం శ్రమ ప‌డుతున్నారు. పోచిమారెడ్డి రామాంజుల రెడ్డి కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తారని, తండ్రిలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి అడుగుపెట్టాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అనుచరులు ఆశిస్తున్నారు.

Previous articleపవర్ స్టార్ ‘జేమ్స్’ మార్చి 17న విడుదల
Next articleగౌతంరెడ్డి కుటుంబ సభ్యులకు కీలక పదవి ఇచ్చే అవకాశం ?