ఢిల్లీలో ఇంటికే పరిమితమైన కేసీఆర్ !

టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి హఠాత్తుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించేందుకు వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో మంగళవారం ఢిల్లీలో కేసీఆర్‌కు కొన్ని అత్యవసర సమావేశాలు జరుగనున్నాయని, ఊహాగానాలు చెలరేగాయి. అయితే అవన్నీ తప్పని మంగళవారం రుజువైంది.
కేసీఆర్ మంగళవారం కేవలం ఇంటికే పరిమితమయ్యారు. మంగళవారం సాయంత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ పత్రికలు కథనాలు ప్రచురించాయి.సమాజ్‌వాదీ పార్టీకి ప్రచారం చేయడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నాడని మీడియాకు సమాచారం లీక్ అయింది. అవన్నీ తప్పని తేలింది .
ఢిల్లీలో ఉన్న కేసీఆర్ రానున్న రోజుల్లో ఎవరితోనైనా కలుస్తారా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు. తన సతీమణి శోభతో పాటు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కేసీఆర్ వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చారని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ సమావేశాలు లేవని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ పార్టీ తాజా వైఖరిని వివరించేందుకు కల్వకుంట్ల కవిత జాతీయ దినపత్రికల సీనియర్ ఎడిటర్‌లను కలిశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొని ఉన్నందున, మార్చి 10వ తేదీ వరకు యూపీ, పంజాబ్ తదితర రాష్ట్రాలలో జరిగే కేసీఆర్ సమావేశాలకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీలో కానీ, మరెక్కడైనా కేసీఆర్‌ను కలిసేందుకు నేతలెవరూ అందుబాటులో లేరని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా పావులు కదలించడం ప్రారంభించాలని,అందరూ ఆయనను కలవడానికి ఉత్సుకతతో ఉన్నారని టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.

Previous articleNTR, Ramcharan RRR Movie
Next articleఢిల్లీ కిడ్నాప్‌ల వెనుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హస్తం ఉందా? –