పేరుకే ఎంపీలు.. విశాఖకు ఒరిగిందేమీ లేదు..!

విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒకప్పటి పార్లమెంట్ సభ్యులు చాలా శక్తివంతమైన వారు , వారి కేంద్రంగానే రాజకీయాలు నడిచేవి. విశాఖ జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు జాతీయస్థాయిలో తమదైన ముద్రను వేయలేకపోతున్నారు. గతంలో ఎంపీలుగా పనిచేసిన ద్రోణంరాజు సత్యనారాయణ, పురందేశ్వరి, సుబ్బరామిరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి , కంభంపాటి హరిబాబు వంటి వారు ఢిల్లీ లో చక్రం తిప్పారు.

ప్రజా సమస్యలపై గళం విప్పడంలోనూ… అభివృద్ధి కోసం ప్రయత్నించడం లోనూ తమదైన ముద్ర వేశారు. ప్రస్తుత వైసిపి పార్లమెంట్ సభ్యులు క్రియాశీలకంగా లేరని పేరుంది . కానీ వైజాగ్ జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎంపీల ప్రస్తుత తమదైన ముద్ర వేయలేకపోతున్నారు. సొంత పార్టీలోనే ఎంపీలు ఎమ్మెల్యేలు ఖాతరు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి . ఈ ఎంపీలు ఎవరూ ప్రజలకు తెలియకపోవడమే పెద్ద సమస్య.జనాదరణ పొందిన నాయకులు కారు వీరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో విశాఖ జిల్లా ప్రజలు వీరికి ఓటు వేసి పార్లమెంట్ సభ్యులుగా గెలిపించారు వారు ప్రజలతో సంబంధాలు కొనసాగించడం లేదు,నియోజకవర్గాల్లో పర్యటించడం లేదు. వారు ఎక్కువగా తమ సొంత పనుల పైనే సమయాన్ని వెచ్చిస్తున్నారు. సొంత పార్టీలోనే కూడా ఒకరిపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ మాధవి, అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి పార్లమెంట్‌లో మౌనంగా ఉంటున్నారు. తమ నియోజకవర్గాలు,పార్టీ వేదికల్లో కూడా మౌన ప్రేక్షకులుగా ఉంటున్నారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ మాధవి ఇద్దరూ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. అనకాపల్లి ఎంపీ భీశెట్టి సత్యవతి చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు అయినప్పటికీ,ఆమె కూడా మొదటిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు.

వైజాగ్‌ రైల్వే జోన్‌ సమస్య,ఇఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం ,ఇతర సమస్యల పై కూడా వారు చొరవ చూపడం లేదు. విశాఖకు గుర్తింపు రావడంలో కీలకమైనది స్టీల్ ప్లాంట్. 5 లక్షల మంది జీవితాలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేస్తుంది. ఇప్పుడీ పరిశ్రమపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. స్ధానిక ఎంపీలుగా వీరంతా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడమో.. మంత్రులను కలిశామని చెప్పడానికో పరిమితం అవుతున్నారే తప్ప గట్టిగా పట్టుబట్టి పార్లమెంటులో నిలదీయడం లేదని విమర్శలు ఉన్నాయి.
విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ కు స్థానిక ఎమ్మెల్యేలకు మధ్య సయోధ్య లేదు. ఆయన సొంత వ్యాపారాలు కే పరిమితమయ్యారు .వైసిపి చెందిన (ఉత్తరాంధ్ర) ప్రముఖ నాయకుడితో ఎంపీ సత్యనారాయణకు సమస్యలు ఉండడంతో ఆయన వ్యాపారాలకే పరిమితమయ్యారు. అనకాపల్లి ఎంపీ సత్యవతికి డాక్టర్గా పెద్ద పేరు ఉన్నా.. ప్రజలకు అందుబాటులో ఉండరు అనే అపవాదు ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ వర్గం.. సత్యవతి గ్రూప్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆధిపత్యం కోసం పోరు కొనసాగుతోంది.
గొడ్డేటి మాధవి.. అరకు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఈ రెండున్నరేళ్లలో ఆమె ఏనాడూ సమస్యలపై ఎలుగెత్తి చెప్పిన దాఖలాలు లేవు. పేరుకు పర్యాటక ప్రాంతమైనా గిరిజనుల అగచాట్లు అన్నీఇన్నీ కావు ,ఇక్కడ గ్రూపుల గోల తక్కువేమీ లేదు. పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో ఎంపీ మాధవికి సరి పడటం లేదు. వీరంతా ఢిల్లీ పెద్దల సభలో ప్రతినిధులు రాష్ట్ర అభివృద్ధికి , ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారని వీరిని ఎన్నుకున్నారు ఈ నేతలు నామమాత్రపు గానే మిగిలిపోయారు. వీరు ఇలాగే కొనసాగితే రాజకీయంగా తెరమరుగు అవుతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Previous articleతెలంగాణలో బీహారీ బ్యూరోక్రాట్లకు పెద్దపీట: రేవంత్
Next articleNTR, Ramcharan RRR Movie