మంచు విష్ణు ఇదేందయ్యా

ఎప్పుడూ తరచూ వివాదాల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది మంచు ఫ్యామిలీ. సినిమా, రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వ్యక్తిగత ఎదో ఒక విషయంలో వివాదం ఉంటూనే ఉన్నది. ప్రస్తుతం మా అధ్యక్షుడు మంచు విష్ణు మరో వివాదంలో చిక్కుకున్నారు. మంచు విష్ణు అఫిసులో ఐదు లక్షల విలువ చేసే సామగ్రి చోరికి గురయ్యాయి అని విష్ణు మేనేజర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ నాగ శీను పైనే తమకు అనుమానం ఉందని అరోపించగా, పోలీసులు నాగ శీనుని అదుపులో తీసుకొని ప్రశ్నించడంతో విష్ణు, ఆయన మేనేజర్ తనకి జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా తనని కులం పేరుతో దూషించి చాలా ఇబ్బందులకు గురిచేశారు. ఓసారి మోకాలపు పై కూర్చోబెట్టి అవమానించడం తో వాళ్ళ దగ్గర పని మానేశాను. అందుకే తన మీద ఇలా దొంగతనం నేరం నెట్టి కక్ష తీర్చుకుంటున్నారు అని అతను అంటున్నాడు. శీను కి జీతం ఇవ్వకపోవడం. ఈమధ్యనే విడుదలైన సినిమా సన్ ఆఫ్ ఇండియా కి సంబంధించిన పారితోషకం ఇవ్వకపోవడంతోనే మంచు ఆఫీస్ నుండి అతను కాస్ట్లీ విగ్గులు ఎత్తుకెళ్ళి ఉంటాడని గుసగుసలు వినిపిస్తుంది. అయితే నాగ శీను మాట్లాడుతూ దొంగతనానికి నాకు సంబంధ లేదు మీరు పెద్దలు ఇలా చేయడం తగదని ఒక వీడియో విడుదల చేశాడు

Previous articleOccasion of Mahashivaratri New poster from ‘My Name Is Shruthi’
Next articleగన్నవరం పై కన్నేసిన వైసీపీ నేత?