తెలంగాణలో బీహారీ బ్యూరోక్రాట్లకు పెద్దపీట: రేవంత్

ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి తన చురుకైన స్వభావం, దూకుడు ప్రసంగాలతో తనకంటూ రాజకీయంగా ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఆయన స్వభావం వల్ల గతంలో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, ఆయన తన స్వభావాన్ని మార్చుకోలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయంగా మరింత దూకుడు పెంచారు.
అదే తీరును కొనసాగిస్తూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అధికార టిఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన చేసిన వ్యాఖ్యలు పలువురిని కలచివేసాయి.మొన్న జరిగిన ఓ కార్యక్రమంలో సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తూర్పు రాష్ట్రమైన బీహార్ నుంచి వచ్చిన బ్యూరోక్రాట్లే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. దీనికి కారణం చెబుతూ.. బీహారీ బ్యూరోక్రాట్లకు పెద్దపీట వేసి తెలంగాణ బ్యూరోక్రాట్లను పక్కన పెట్టారని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని నిరూపించడానికి ప్రస్తుతం రాష్ట్రంలో కీలకమైన పదవులను నిర్వహిస్తున్న బీహారీ బ్యూరోక్రాట్ల పేర్లను ఉదహరించారు.తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి రేవంత్ రెడ్డి బహిరంగంగా వారి పేర్లను ఎందుకు తీసుకున్నారని పలువురికి ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణ రాష్ట్రాన్ని బీహారీ బ్యాచ్ పాలిస్తోంది.తెలంగాణ అధికారులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా బీహార్ అధికారులకు కీలక శాఖలు,బహుళ శాఖలు ఇస్తోంది.స్థానిక అధికారుల గురించి ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్, ఐపీఎస్ అంజనీ కుమార్ ఐపీఎస్ లు బీహార్‌కు చెందినవారు,వీరికి ఒక్కొక్కరికి ఐదు నుంచి ఆరు శాఖలు కేటాయించారు” అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను టీఆర్‌ఎస్ ఉపయోగించుకోవచ్చని వార్తలు హల్ చల్ చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై,తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు రెండూ బలపడుతుండటం, అధికార టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంతో ప్రభుత్వం ప్రశాంత్ కిషోర్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ప్రశాంత్ కిషోర్‌ ట్రాక్ రికార్డ్,విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, అతను పనిచేసిన అన్ని పార్టీలను అఖండ విజయాల వైపుకు తీసుకువెళ్లారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని విజయ తీరాల వైపు తీసుకు వెళ్తారని టిఆర్ఎస్ క్యాడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Previous articleగన్నవరం పై కన్నేసిన వైసీపీ నేత?
Next articleపేరుకే ఎంపీలు.. విశాఖకు ఒరిగిందేమీ లేదు..!