ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యం..

విశ్వవిఖ్యాత సార్వభౌమ నటరత్న ఎన్టీ రామారావు సినీ పరిశ్రమకు వచ్చిన తొలిరోజుల్లో కేవలం హీరో పాత్రలే కాకుండా, నెగెటివ్ పాత్రలు కూడా చేసి శభాష్ అనిపించుకున్నారు. హీరో కావాలని పరిశ్రమకు వచ్చిన ఎన్టీఆర్ నెగెటివ్ పాత్రలు చేయడం ఓ రకంగా పెద్ద సాహసమే. అయితే, నటుడుగా నిలదొక్కుకుంటున్న తరుణంలోనే వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఆయన పట్టుదలగా ఉండేవారు. ఇమేజ్ కు కట్టుపడితే వైవిధ్యం కనుమరుగవుతుందని బలంగా విశ్వసించేవారు. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ అందులో ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. అందులో బ్రిటీష్ అధికారులు చెప్పినట్టు చేసే స్ట్రిక్ట్ పోలీస్ అధికారి ఆయనది. స్వాతంత్రోధ్యమ పోరాటానికి నడుంబిగించిన కాంగ్రెస్ వారిని, వారికి వెన్నుదున్నగా నిలిచిన ప్రజలను ఆయన లాటీలతో చితకబాదే సన్నివేశంలో నటించారు. ఈ సినిమా తరువాత ఆయన నటించిన ‘పల్లెటూరి పిల్ల’ చిత్రంలో కూడా రెవెన్యూ అధికారి పాత్రలో నటించారు. ప్రజల నుండి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేయడం, బక్కచిక్కిన గుర్రాన్ని కాళ్ళతో తన్నడం వంటి వరకూ సన్నివేశాలు ఆ చిత్రంలో ఆయనకు ఉన్నాయి. ‘పరివర్తన’, ‘తొడుదొంగలు’ చిత్రాల్లో కూడా ఎన్టీఆర్ కథానాయకుడు అయినప్పటికి ఆయా పాత్రల్లో నెగెటివ్ టచ్ ఉంది. రఘురామయ్య హీరోగా నటించిన ‘మాయారంభ’ చిత్రంలో నలకూబరుడిగా ఎన్టీఆర్ విలనీ పాత్రలో నటించారు. వీటన్నిటికి మించి పూర్తి డీగ్లామరైజెడ్ పాత్రలో ‘రాజు పేద’ చిత్రంలో నటించారాయన. ఏ నటుడు ఇలాంటి పాత్ర చేయడానికి సాహసించడు. అయితే ఎన్టీఆర్ ఆ పాత్ర ఛాలెంజ్ గా తీసుకుని నటించారు. ముఖానికి నల్లటి రంగు, చింపిరి జుట్టు, చినిగిపోయిన దుస్తుల్లో ఆయన ఈ చిత్రంలో కనపడతారు. ‘గుడిగంటలు’ చిత్రంలో ఆయనే హీరో అయినప్పటికీ పాత్రలు నెగెటివ్ షేడ్స్ ఉంటాయి. ఇలా పలు చిత్రాల్లో నెగెటివ్ పాత్రలు పోషించినా, ‘మల్లీశ్వరి’ ‘పాతాలభైరవి’ వంటి చిత్రాల్లో తిరుగులేని హీరోగా నిలబడిపోయారు. ఇటు జానపద చిత్రాలు, అటు పౌరాణిక చిత్రాల్లో తనకు తనేశాటి అనిపించుకున్నారు. ‘రక్తసంబంధాలు’, ‘చిరంజీవులు’, ‘రాము’ వంటి ఎన్నో చిత్రాల్లో కూడా తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు

Previous articleతెలుగుదేశం సీనియర్ నేత యడ్లపాటి కన్నుమూత
Next articleటీఆర్ఎస్ భవిష్యత్ వ్యూహాలపై పీకే దిశానిర్దేశం!?