ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడుపుతా : నారా లోకేశ్

ఇకపై కుటుంబ సభ్యులతో కాకుండా ప్రజల మధ్యే ఎక్కువ సమయం గడుపుతానని కుటుంబ సభ్యులకు చెప్పినట్లు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.రాబోయే రోజుల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని,నిరంకుశ వైఎస్సార్‌సీపీని తరిమికొట్టేందుకు తాను ప్రజల్లో ఉంటానని చెప్పారు.వైజాగ్ టీడీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆయన కేసులకు భయపడేది లేదన్నారు.రాజకీయాల్లో అన్నీ చూశానన్నారు.జైలు మాత్రమే మిగిలి ఉందని ఆయన అన్నారు.అరెస్టులు,పోలీసుల అతిక్రమణలకు భయపడేది లేదన్నారు.

ఇక నుంచి ప్రజలతోనే ఎక్కువ సమయం గడుపుతానని తన భార్యకు, కుమారుడుకు చెప్పినట్లు తెలిపారు.ప్రజల కోసం పనిచేసేలా నా కొడుకు నన్ను ప్రోత్సహిస్తున్నాడు అని
లోకేశ్ తెలిపారు. చాలా కాలంగా ఇంటికే పరిమితమయ్యారని దేవాన్ష్ తనపై తాత కూడా ఫిర్యాదు చేశారని ఆయన చమత్కరించారు.సీనియర్ నేత అయ్యన్న పాత్రుడుపై నర్సీపట్నంలో పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై 11 కేసులు ఉన్నాయని, వైఎస్సార్‌సీపీ ఆగడాలకు భయపడేది లేదని లోకేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీకి తగిన గుణపాఠం చెబుతామన్నారు.

Previous article“మన ఊరు-మన పోరు”తో రేవంత్ మార్క్ రాజకీయాలు! –
Next articleటీఆర్ఎస్ లోకి ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవా!