ఆగస్టు నుంచి నారా లోకేష్ పాదయాత్ర?

ఆగస్టు నుంచి నారా లోకేష్ భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. టీడీపీ వర్గాల లెక్కల ప్రకారం పాదయాత్ర రికార్డుల మోత మోగించనుంది. ఇలాంటి భారీ యాత్రతోనే ప్రజల్లో వైఎస్సార్‌సీపీ పై వ్యతిరేకత, అసంతృప్తి వెల్లువెత్తుతాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. చంద్రబాబు సొంత సొంత నియోజకవర్గం అయిన కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.
పాద యాత్ర ఏడాది పొడవునా ఉంటుంది కానీ మధ్యలో మూడు నుండి నాలుగు విరామాలు ఉండవచ్చు. వాస్తవానికి, ఏప్రిల్ లేదా మేలో యాత్ర చేపట్టాలనే ఆలోచన ఉంది, అయితే వేసవి కాలం ను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకున్నారు. అందువల్ల పాదయాత్ర ఆగస్టు నుండి ప్రారంభించాలని భావిస్తున్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రత్యామ్నాయంగా నారా లోకేష్‌ను నిలబెట్టడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యం.
2019 ఎన్నికల్లో మంగళగిరిలో ఎవరికీ తెలియని ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో లోకేష్ ఇమేజ్‌కి తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే, లోకేశ్ ప్రసంగాల్లోని గ్యాఫ్‌లు, ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఆయన ఇమేజ్‌ని పునరుద్ధరించేందుకే ఈ యాత్రను ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ విజయానికి సోఫానాలు. నిజానికి, దివంగత వైఎస్ఆర్ పాద యాత్ర ప్రారంభించారు .

వైఎస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆయనను అధికారంలోకి తెచ్చింది. ఆ తర్వాత చంద్రబాబు పాదయాత్ర చేపట్టి 2014లో అధికారంలోకి వచ్చారు. జగన్, షర్మిల పాదయాత్ర వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఎలా చేసింది. ఎన్టీఆర్ మనవడుగా ,చంద్రబాబునాయుడు కుమారుడిగా గుర్తింపు ఉన్న లోకేష్ ఈ పాదయాత్ర ప్రజల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది . పాదయాత్ర లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తుందో లేదో వేచి చూద్దాం .

Previous articleచంద్రబాబు రాజకీయ ఆరంగేట్రం చేసి నేటికి 44 ఏళ్లు
Next articleబహుభాషా భారీ బడ్జెట్ చిత్రం
సేవాదాస్ సెన్సార్ పూర్తి!!