చంద్రబాబు రాజకీయ ఆరంగేట్రం చేసి నేటికి 44 ఏళ్లు

సరిగ్గా ఈ రోజే..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ..
నారా చంద్రబాబు నాయుడు
రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజు ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చిన రోజు..
ఫిబ్రవరి 25 1978 చిత్తూరు జిల్లా చంద్రగిరి లో MLA గా పోటీచేసిన రోజు ..
ఇప్పటి కి 44 సంవత్సరాల క్రితం ఒక యువకుడుగా వచ్చి ప్రతి ఒక ఇంటికి పోయి అమ్మ అయ్యా మీ ఓటు మాకు వేయాలి అంటూ ..
అంటే..
ఆ రోజులో నాయకులు ఇంటికి పోయి ఓట్లు అడగడం చాలా అరుదు అలాంటి సమయంలో ప్రజల్లోకి పోయి చంద్రగిరిలో 1978 ఫిబ్రవరి 27 న పట్టాభి రామ చౌదరి పై 2494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 15 మార్చి 1978 నాడు మొదటిసారిగా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉండడం ప్రతి గడపకు వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పటం నచ్చి చంద్రగిరి ప్రజలు ఒక యువకుడిని అసెంబ్లీకి పంపారు

ఆరోజున..
చంద్రగిరి ప్రజలకు తెలవదు తాము గెలిపించిన ఒక సాదాసీదా విద్యార్థి నాయకుడు సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి రాజకీయ మేధావి అవుతాడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు సార్లు ముఖ్యమంత్రి అవుతారని ఏ దిక్కు లేక స్వార్థంతో విడగొట్టబడిన ఒక రాష్ట్రానికి తానే దిక్కు అవుతారని ఊహించలేదు ..
ప్రపంచములో రాజకీయం అనే ఒక గ్రంథం ఉంటే ఒక అధ్యాయమే చంద్రబాబు … చంద్రబాబు అనే రాజకీయ విశ్వవిద్యాలయములో వేల మంది నాయకులు పుడతారని, ప్రపంచములో ఏ మూలకు వెళ్లినా ఆంధ్ర ప్రదేశ్ అన్నపేరు వినగానే చంద్రబాబు అన్న పేరు తప్పక వినిపిస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
40 సంవత్సరాలు రాజకీయ జీవితం లో ఉండటం మామూలు విషయం కాదు. ఆయన రాజకీయ పరమపద సోపానము లో చూడనిది లేదు..
ఎత్తులు.. పల్లాలు ,ఓటములు…. గెలుపులు ,సత్కారాలు.. చీత్కరాలు ఎన్నో ఆటుపోటులు చవిచూశారు..

Previous articleభీమ్లా నాయక్ రివ్యూ
Next articleఆగస్టు నుంచి నారా లోకేష్ పాదయాత్ర?