ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తలు. ప్రజా ప్రతినిధిని ప్రజల గొంతుకగా భావిస్తారు. అయితే చాలా మంది వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను ప్రభుత్వం వద్ద వ్యక్తం చేయడంలో తమకు ఎలాంటి పాత్ర లేదని అంటున్నారు. వారు ప్రజల మనోవేదనలను ప్రభుత్వానికి వినిపించలేరు , ప్రజల కోసం పనులు చేయలేరు.దీంతో పెద్ద సంఖ్యలో వైస్సార్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను జగన్ నియమించిన గ్రామ కార్యదర్శులే చూసుకుంటున్నందున అందులో తమ పాత్ర ఏమీ లేదని వారు అసంతృప్తితో ఉన్నారు.
గ్రామ సచివాలయ వ్యవస్థ తో ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా సంబంధాలు ఉండటంతో ఎమ్మెల్యేలు పక్కదారి పడుతున్నారు.వారు ఓటర్లను ప్రభావితం చేయలేక, వారికి సహాయం చేయలేక ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించలేదు.దీంతో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు.దీంతో వారు తమ తమ నియోజకవర్గాల ఓటర్లతో ఎలాంటి అనుబంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎమ్మెల్యేలు తమ ఓటర్లను కలవలేకపోతున్నారు.దీంతో ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.తమ నియోజకవర్గాల్లో కొన్ని పనులు చేపట్టేందుకు వీలుగా వైఎస్ జగన్ నిధులు విడుదల చేస్తారని ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు.