కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో ఏపీ : ఐవైఆర్‌

ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో సలహాదారుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు రాష్ట్రంలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఆయన కుండ బద్దలు కొట్టారు.బుధవారం ఐ వై ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని, సంక్షేమ పథకాల కోసం విచక్షణా రహితంగా అప్పులు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
“ఎవరైనా బడ్జెట్‌ను ఎలా సిద్ధం చేయాలో తెలుసుకోవాలనుకుంటే, కేంద్ర బడ్జెట్‌ను పరిశీలించాలి.మరి ఎవరికైనా బడ్జెట్‌ను ఎలా రూపొందించకూడదో తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను చూడాలి’’అని అన్నారు.ఆదాయంతో పొంతన లేకుండా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసే ప్రభుత్వం ఉంటే ఏ రాష్ట్రం అభివృద్ధి చెందదని మాజీ ఐఏఎస్ అధికారి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోతోందని, రేపటి రోజున ప్రజలపైనే పన్నుల భారం మోపాలన్నారు.ఎన్నికల్లో పోటీ చేసే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తమ వాగ్దానాలను నెరవేర్చేందుకు ఆదాయ వనరులు చూపాలని షరతు విధించాలని కృష్ణారావు పిలుపునిచ్చారు.ఎన్నికల సంఘం ఆ పరిస్థితి తీసుకురావాలని ఆయన సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను సొంత పథకాలకు మళ్లిస్తోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.గత ఎనిమిదేళ్లలో ఏ రాష్ట్రానికీ ఇవ్వనంతగా మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.“వాస్తవానికి, లోటు బడ్జెట్ కారణంగా పన్ను రాబడి రూపంలో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ సహకారం చాలా తక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు ఇన్నేళ్లుగా ఎంత మొత్తం వచ్చిందో సవివరమైన గణాంకాలతో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నారు.కోలుకోలేని ఆర్థిక సంక్షోభంలో ఏపీ ఉందని ఐవైఆర్‌ అన్నారు

Previous articleబొత్స రిటైర్మెంటా.. రాజ్యసభ కా..?
Next articleజగ్గా రెడ్డి మనసు మార్చుకుంటారా!