తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘీభావ దీక్ష

నీళ్లు ,నిధులు ,నియామకాలు అనే నినాదంతో తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యువతరం ముందుండి నడిపించింది రాష్ట్ర విభజన అనంతరం టిఆర్ఎస్ పార్టీ 8 ఏళ్ల పాలనలో యువతను మోసం చేసింది
కెసిఆర్ పాలనలో జాబ్ క్యాలెండర్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు, ఉద్యోగాల ఖాళీలను భర్తీ లేదు, నిరుద్యోగ భృతి అంతకన్నా లేదు నిరుద్యోగ జీవితాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నిరుద్యోగులకు సంఘీభావంగా తెలుగుదేశం తెలంగాణా పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘీభావ దీక్ష చేపట్టింది. ప్రతి సంవత్సరం జనవరి లో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ కుటుంబాల ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్లో నిరుద్యోగ సంఘీభావ దీక్ష తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘీభావ దీక్ష నిర్వహిస్తున్నది. టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రాష్ట్ర కేంద్ర కమిటీ సభ్యులు పార్లమెంటరీ ప్రతినిధులు ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు నిరుద్యోగ సంఘీభావ దీక్షలోపాల్గొంటున్నారు

Previous articleతెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేత పై కొనసాగుతున్న రేవంత్ పోరాటం !
Next articleవైఎస్ అవినాష్ రెడ్డి పై దృష్టిసారించిన సిబిఐ ..?