వైఎస్ అవినాష్ రెడ్డి పై దృష్టిసారించిన సిబిఐ ..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు నిండా మునిగినట్లు తెలుస్తోంది. సీబీఐకి వాంగ్మూలం ఇస్తున్న ప్రతి ఒక్కరూ వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వివరించారు.తాజాగా దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన అంశాలు , పులివెందులలో అప్పటి పోలీసు అధికారుల వాంగ్మూలం మరింత సంచలనంగా మారింది.

వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా శంకరయ్య ఉన్నారు. ఆయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ చేసి వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని కేసు వద్దని అవినాష్ రెడ్డి అన్నారని తెలిపారు. వై.ఎస్.అవినాష్రెడ్డి, వై.ఎస్.భాస్కర్రెడ్డి, వై.ఎస్.మనోహర్రెడ్డిలు ఆధారాలు తుడిచేశారన్నారు. ఇంటి తలుపులు వేసి గాయాలకు కట్లు, బ్యాండేజీలు వేసే సిబ్బందినే అనుమతించారు. సాక్ష్యాలు తుడిచేస్తూంటే వారించానన్నారు. మొత్తాన్ని వీడియో తీస్తూంటే ఆపేయాలని దేవిరెడ్డి శివశంకర్రెడ్డి బెదిరించారన్నారు. మొత్తంగా అప్పుడేం జరిగిందో సీఐ స్పష్టంగా వాంగ్మూలం ఇచ్చారు .అయితే సీఐ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పటిది 2020 జులై 28న సీబీఐ అధికారుల ఎదుట ఈ వివరాలు చెప్పారు. తాజాగా వెలుగు చూసింది.
సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడి అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని మంగళవారం భద్రతను కోరారు. వివేకానంద రెడ్డికి డ్రైవర్‌గా పనిచేసిన షేక్ దస్తగిరి విలేకరులతో మాట్లాడుతూ తనకు, తన కుటుంబ సభ్యులకు సరైన భద్రత కల్పించాలని అన్నారు. పోలీసులను ఆశ్రయించిన తర్వాత తనకు భద్రత కల్పించడం పట్ల ఆయన సంతృప్తి చెందలేదు. ఈ కేసులో నాల్గో నిందితుడిగా ఉన్న దస్తగిరి, ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)కి రెండు వాంగ్మూలాలు ఇవ్వడంతో తన ప్రాణాలకు మరియు అతని కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు పెరిగిందని అన్నారు.
సిబిఐ సోమవారం పులివెందుల కోర్టు ముందు సిఆర్‌పిసి సెక్షన్ 164 (1) కింద దస్తగిరి రెండవ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసింది. గతేడాది ఆగస్టు 31న అతడి తొలి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో సీబీఐకి దస్తగిరి చేసిన ఫిర్యాదు మంగళవారం బహిరంగమైంది. తన మొదటి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత, కొందరు నిందితులు మరియు అనుమానితులు సిబిఐ ముందు చేసిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఎంతైనా డబ్బు, 10 నుంచి 20 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి తనను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. మొత్తం మీద వైఎన్ వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి, ఆయన కుటుంబం ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. వీరి అరెస్ట్‌లు ఏ క్షణంలోనైనా జరగవచ్చని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది

Previous articleతెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సంఘీభావ దీక్ష
Next articleMassy SWAGSTER
@Suriya_offl is the Name!
Latest Posters of ఈటి