ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లా నాయక్‌కు లభించని ఊరట !

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ ధర జిఓ ను సవరించాలని భావిస్తున్నది . తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ప్రభుత్వం ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. భీమ్లా నాయక్ విడుదలకు ముందే జిఓ బయటకు వస్తుందని భావించినప్పటికీ, అలాంటి సంకేతాలు లేవు. స్పెషల్ షోలు ,బెనిఫిట్ షోలను ప్రదర్శించకూడదని ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రభుత్వ అధికారులు ఎగ్జిబిటర్లకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది జారీ చేసిన జిఓ 35ని కచ్చితంగా పాటించాలని ఎగ్జిబిటర్లను కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక షోలు ఉండవని, మార్నింగ్ షోలతో భీమ్లా నాయక్‌ను ప్రదర్శించనున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఐదవ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది . ఫిబ్రవరి 25వ తేదీ ఉదయం 4 గంటలకు స్పెషల్ షోలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో సినిమాకు రెండు వారాల పాటు అనుమతులు మంజూరు చేశారు. నైజాంలో ప్రీ-సేల్స్ అనూహ్యంగా ఉన్నాయి, అయితే టిక్కెట్ ధర మరియు స్పెషల్ షోలపై స్పష్టత లేనందున ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జిబిటర్లు ఆన్‌లైన్ అమ్మకాలను ఇంకా తెరవలేదు. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో భీమ్లా నాయక్‌కు ఊరట లభించే టట్లు కనబడటం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో భీమానాయక్ బెనిఫిట్ షో లకు , స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Previous articleజాతీయ రాజకీయాల్లోకి హరీష్ రావు..!
Next articleఅమరావతి ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందా?