కాపుల గొంతుకగా ఎదగాలని యోచిస్తున్న గంటా.. !

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వేగంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. గంటా వచ్చే వారం మెగా స్టార్ చిరంజీవితో భేటీ అవుతున్నారు. చిరంజీవితో సమకాలీన రాజకీయాలపై చర్చించనున్నారు. ఏపీలో కాపుల గొంతుకగా ఎదగాలని యోచిస్తున్న గంటా చిరంజీవితో భేటీ కావడం విశేషం. గంటా, చిరంజీవికి చాలా చాలా సాన్నిహిత్యం ఉంది . ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక సభ్యులలో గంటా ఒకరు. చిరు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు కాంగ్రెస్‌లో చేరిన 18 మంది ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు. ఆ తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్రెడ్డి హయాంలో మంత్రి అయ్యారు. అయితే చిరుతో రిలేషన్ మాత్రం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆయన భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గంటా ప్రస్తుతం టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అమరావతిలో ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. కానీ, టీడీపీకి సంబంధించినంత వరకు ఆయనకు ఇప్పటికీ తలుపులు తెరిచి ఉంచారు.తాను పార్టీని వీడుతానని చెప్పలేదు. చంద్రబాబును ప్రత్యేకంగా కలుస్తానని కూడా చెప్పారు. ఇదంతా చూస్తుంటే చిరుతో ఆయన భేటీ కావడం ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది.
గత మూడేళ్లుగా గంటా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించినప్పుడు కూడా ఆయన నిరసనలకు దిగలేదు. గంటా వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే అక్కడ సరైన స్వాగతం లభించలేదని కూడా వార్తలు వచ్చాయి. అదే విధంగా బీజేపీతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరిగినా ఏమీ బయటకు రాలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ఆయన ఏపీ అసెంబ్లీకి రాజీనామా పంపారు, కానీ దానిని ఆమోదించాలని ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. గత కొంతకాలంగా కాపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. కాపులను ఆర్గనైజ్ చేస్తాడా, చిరును లూప్‌లో ఉంచాలనుకుంటున్నారా? గంటా ఎత్తుగడలకు చిరు మద్దతిస్తే, పవన్‌కల్యాణ్‌తో అతని సంబంధాలు ఎలా సాగుతాయి? 2024లో కాపుల పార్టీ పెడతాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Previous articleతెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఈటెల రాజేందర్?
Next articleచైర్మన్ లేకుండానే తెలంగాణ మండలి బడ్జెట్ సమావేశాలు?