శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా ‘భీమ్లా నాయక్’  ప్రీ రిలీజ్ వేడుక

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా ఈ నెల 21 న ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ వేడుక వైభవంగా నిర్వహించటానికి చిత్ర బృందం సంకల్పించింది. హైదరాబాద్, యూసుఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక సాయంత్రం 6.30 నిమిషాలకు ప్రారంభ మవుతుంది. ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ కె.టి.ఆర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే రాష్ట్ర
సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఈ వేడుకకు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. అంగరంగ వైభవంగా ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బృందం అంతా పాల్గొననుంది.

Previous articleమార్చి 4న విడుద‌ల‌వుతున్న శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌, తిరుమ‌ల కిషోర్‌, ఎస్ఎల్‌వీసి `ఆడవాళ్లు మీకు జోహార్లు`
Next articleUrvashi Rai at Gray Movie Press Meet