అభిమాని అత్యుత్సాహం… పవన్ కళ్యాణ్ కి తప్పిన ప్రమాదం

మత్య్సకారులు కోసం రంగంలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నరసాపురంలో బహిరంగ సభలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యారు. కారులోనే అభివందనం చేస్తూ వస్తున్న పవన్ అందరికీ కన్పించాలన్న ఉద్దేశ్యంతో కారుపైకి ఎక్కారు. అయితే అక్కడ అనూహ్యంగా ఓ అభిమాని కారుపైకి ఎక్కి పవన్ ను కౌగిలించుకోబోయాడు. కానీ అంతలోనే ఓ బాడీ గార్డు అది గమనించి, సదరు అభిమానిని పట్టుకుని లాగాడు. కానీ అప్పటికే ఆ వ్యక్తి పవన్ ని పట్టుకోవడం, బాడీ గార్డు లాగడంతో సపోర్ట్ కోసం పవన్ ను పట్టుకోవడం, పట్టుకోల్పోయి అతను కిందకు దూకడం జరిగింది. ఈ హఠాత్పరిణామాల మధ్య పవన్ కారుపైనే జారి పడిపోయాడు. ” ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది “

Previous articleబాలయ్య ,మహేష్ ,రాజమౌళి కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ..?
Next articleఏడాది పాటు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ..!