మూడవ కూటమి ఎవరికీ లాభం ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. బిజెపికి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఆదివారం ముంబైకి వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేతో సమావేశం కానున్నారు. అనంతరం ఎన్సీపీ నేత శరద్ పవార్ తో కేసీఆర్ సమావేశం కానున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతల తో సమావేశమై మూడవ ఫ్రంట్ గా ఏర్పాటు చేసేందుకు ఈ భేటీ కీలక కానున్నట్లు తెలిసింది. త్వరలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో కూడా కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.

జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆదివారం ముంబైలో స్వాగతం పలికేందుకు అక్కడి శ్రేణులు సిద్ధమయ్యాయి. అందుకు ఒకరోజు ముందు నుంచే కేసీఆర్ స్వాగత ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో కేసీ ఆర్ తో పాటు ఉద్ధవ్ ఠాక్రే, దేవేగౌడ , మమతా బెనర్జీ , స్టాలిన్,  అఖిలేష్ యాదవ్ ఫోటోలను పెడుతూ స్వాగతం పలికారు. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ఉద్ధవ్ ఠాక్రే ఇంటివరకు ఫ్లెక్సీలు వెలిశాయి.

గ్రామ గ్రామన కెసిఆర్ జన్మదినోత్సవం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న, బలం ఉన్న ప్రాంతీయ పార్టీలు కలిసి మూడవ కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయా..? ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే మూడవ కూటమి ఏర్పడనున్నదనే అనిపిస్తుంది. బిజెపికి వ్యతిరేకంగా ఈ కూటమి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దాంతో జాతీయ రాజకీయాల్లో రాబోయే ఎన్నికల నాటికి అనేక మార్పులు చెందే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దేశంలో బీజేపీతో ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ పార్టీతో యూపీఏ కూటమి ఉన్నాయి. కాగా మూడవ కూటమి ఏర్పడితే ఏ, ఏ పార్టీలు కూటమిలో చేరబోనున్నాయనే విషయం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం కేసీఆర్ ముంబై పర్యటన తర్వాత కొంతమేరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా మూడవ కూటమి ఏర్పడితే ఎవరికీ లాభం చేకూరే అవకాశాలున్నాయననే విషయంపై రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు.

Previous articleవివాదాలకు తావివ్వకుండా పనిచేస్తాం: డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి
Next articleమార్చి 4న విడుద‌ల‌వుతున్న శ‌ర్వానంద్‌, ర‌ష్మిక‌, తిరుమ‌ల కిషోర్‌, ఎస్ఎల్‌వీసి `ఆడవాళ్లు మీకు జోహార్లు`