బాలయ్య ,మహేష్ ,రాజమౌళి కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీ..?

నటసింహం నందమూరి బాలకృష్ణ .. సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళి .. ఈ ముగ్గురు కలిసి సినిమా చేస్తే ఎలాఉంటాదో ఊహించుకోండి. ఎప్పుడెప్పుడా అని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సమయం త్వరలోనే రానున్నది. రాజమౌళి దర్సకత్వంలో మహేష్ బాబు సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో మల్టీ స్టార్స్ కాంబినేషన్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ఈ సినిమాలో 40 నిమిషాల రోల్ కు బాలయ్య అయితేనే కరెక్టుగా సూట్ అవుతాడని జక్కన్న ఫిక్స్ అయిపోయడంట. మొన్న అఖండతో బాక్సఆఫీస్ షేక్ చేసిన బాలయ్య తిరుగులేని హీరోగా నిలబడిపోయాడు. అఖండతో రికార్డులు దుమ్ము దులిపేసాడు. కుర్ర హీరోల కన్నా జోష్ లో ఉన్న బాలయ్య హీరోగా మలినేని గోపిచెందు దర్శకత్వంలో సినిమా మొదలయింది. రాజమౌళి దర్సకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్లో మల్టిస్టార్ పాన్ ఇండియా మూవీగా ఆర్.ఆర్. ఆర్. వేసవి కానుకగా మార్చి 25న విడుదలవుతున్నది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రస్తుత సినిమా సర్కార్ వారి పాట సినిమా చివరి దశలో ఉన్నది. ఆ తరువాత ముగ్గురి కాంబినేషన్ సినిమా ఉండవచ్చు. ఈ కధనాల్లో వాస్తవాలు తెలియాలంటే ప్రకటన వచ్చేదాకా ఆగాల్సిందే. మహేష్, రాజమౌళి చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె. ఎల్. నారాయణ నిర్మించునున్నారు. సంగీతం ఎమ్. ఎమ్. కీరవాణి అందించునున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నిజమయితే నందమూరి, సూపర్ స్టార్ అభిమానులకు నిజంగా పండగే

Previous articleచైనాకు అక్రమ గ్రానైట్ ఎగుమతి పై ఈడీ, సీబీఐ విచారణ
Next articleఅభిమాని అత్యుత్సాహం… పవన్ కళ్యాణ్ కి తప్పిన ప్రమాదం