విజయసాయిరెడ్డికి జగన్‌ రెడ్డి షాక్‌ ఇస్తారా..?

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పదవీ కాలం ముగియబోతున్న నేపధ్యంలో మళ్లీ ఆయన పదవిని సిఎం జగన్‌ రెడ్డి పొడిగించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయో.. మాకు తెలియటం లేదు కానీ.. సిఎం జగన్‌ రెడ్డి విజయసాయిరెడ్డిని వదిలించుకునే అవకాశాలున్నాయని.. మళ్లీ ఆయన పదవి పొడిగింపు జరగదంటున్నారు తెర వెనుక అధికార పార్టీ ముఖ్య నేతలు.

ఉత్తరాంధ్ర జిల్లాలలో ముఖ్యంగా విశాఖ జిల్లాలో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహారశైలితో పాటు ఆయన పేరుతో అనుచరులు సృష్టిస్తున్న దౌర్జన్యాలు, భూఆక్రమణలు, ఇతర సంఘటనల ప్రభావం బాగాపనిచేసి అధికార పార్టీపై వ్యతిరేకతను బాగా పెంచిందని.. అధికార వర్గాలు సిఎం జగన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.

విశాఖలో పేరుకే ప్రజాప్రతినిధులు, అమాత్యులు, అధికార పార్టీ ముఖ్య నేతలు. పెత్తనమంతా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డే చేస్తున్నారని.. జిల్లా స్థాయి అధికారులందరూ ఆయన ఆదేశాలనే పాటిస్తున్న నేపధ్యంలో మేము మంత్రులుగా ఉండి ప్రయోజనం ఏమిటి..? మేము ప్రజాప్రతినిధులుగా ఏం సాధించాం అని స్థానిక నేతలందరూ తెర వెనుక పరస్పరం చెప్పుకుంటున్నారట.

రాజ్యసభ పదవి ముగియపోతున్న నేపధ్యంలో తనకు మళ్లీ జగన్‌ రెడ్డి పదవి పొడిగిస్తారన్న అనుమానం కూడా విజయసాయిరెడ్డిలో స్పష్టంగాకనిపిస్తుందంటున్నారు ఆయన అనుచరులు. అందుకేనేమో ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి గొంతు వినిపించటం లేదు.

మనిషి కూడా విశాఖ పట్నంలో ఎక్కువగా కనిపించటం లేదు. శాసనసభ ఎన్నికలకు రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ.. అప్పుడే తెరపైకి ఎన్నికల వాతావరణం వచ్చిందని..ఈ నేపధ్యంలో విజయసాయిరెడ్డిని కూడా పక్కన పెడితేనే.. ఉత్తరాంధ్ర జిల్లాలలో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి పొందగలుగుతానని జగన్‌ రెడ్డి భావిస్తున్నట్లు బయటకు పొక్కింది.

కారణాలు ఏమైనప్పటికీ.. జరగబోయే రాజ్యసభ ఎన్నికలలో విజయసాయిరెడ్డికి మళ్లీ రాజ్యసభ సీటు దక్కే అవకాశాలు రోజు రోజుకు తగ్గుతున్నాయంటున్నారు తెర వెనుక అధికార ముఖ్య నేతలు. మొన్నటి వరకు చంద్రబాబు, లోకేష్‌ పవన్‌ కళ్యాణ్‌లపై రాజకీయ ఛలోక్తులతో పాటు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న జరిగిన సంఘటనలతో తనకు ఏం సంబందం లేనట్లుగా ఎవరికీ కనిపించకుండా.. మాట వినిపించకుండా.. మౌనవ్రతాన్ని పాటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది

Previous articleబిజెపితో చంద్రబాబు పొత్తు కుదుర్చుకుని ఎన్నికల బరిలోకి దిగితే..!
Next articleతెలంగాణసెంటిమెంట్’ టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌లకు ఇప్పటికీ ట్రంప్ కార్డ్!