మంత్రి కొడాలి నాని విషయంలో కేశినేనినాని మౌనంలో..!

మంత్రి కొడాలి నాని అటు చంద్రబాబు, ఇటు లోకేష్‌లపై చేస్తున్న విమర్శలు,ఆరోపణలకు విజయవాడ ఎంపీ కేశినేని నాని స్పందించకపోవటం వెనుక మర్మం ఏమిటి..? మంత్రి కొడాలి నాని అంటే టిడిపి ఎంపీ కేశినేని నానికి భయమా..? పార్టీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని చేస్తున్న అభ్యంతర కర వ్యాఖ్యలను టిడిపి ఎంపీ కేశినేని నాని ఇంత వరకు ఖండిరచలేదని.. అనవసరంగా మంత్రి కొడాలి నానితో ఎందుకని.. ఎంపీ కేశినేని నాని భావిస్తున్నారా… లేదా చంద్రబాబు, లోకేష్‌లపై చేస్తున్న విమర్శలు,ఆరోపణలు తనపై కూడా చేస్తారని.. కేశినేని నాని చేస్తున్నట్లుగా స్పష్టం అవుతోందంటున్నారు టిడిపి నేతలు. విజయవాడ ఎంపీగా అపార రాజకీయ అధికార అనుభవం ఉన్న కేశినేని నాని మంత్రి కొడాలి నాని విషయంలో ఏ కారణాలతో వెనకడుగు వేస్తున్నారు. అదే విధంగా మంత్రి కొడాలి నానికూడా కేశినేని నానిపై ఎందుకు విమర్శలు, ఆరోపణలను చేయలేకపోతున్నారు. ఎక్కడో ఏదో జరుగుతోందని..ఈ విషయంలో ఎంపీ కేశినేని నాని రాజకీయంగా తప్పుటడుగు వేశారని.. మంత్రి కొడాలి నానిచేస్తున్న వ్యాఖ్యలను బాహాటంగా తప్పుబడితే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా విజయవాడ ఎంపీ కేశినేని నానిని వ్యతిరేకిస్తున్న పార్టీలోని ఒక వర్గం తాజా పరిస్థితులు అనుకూలంగా మలుచుకుని మంత్రి కొడాలి నాని విషయంలో ఎంపీ కేశినేని నాని ఎందుకు మౌనం వహిస్తున్నారు అనే విషయంపై రకరకాలుగా కధనాలు ప్రచారం చేసినా ఆశ్చర్య పడక్కర్లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Previous articleసుద్దపల్లి క్వారీ వద్దే ధూళిపాళ్ల నరేంద్ర దీక్ష.. తెదేపా నేతల గృహనిర్బంధం
Next articleజగన్‌ రెడ్డి ఒద్దు.. చంద్రబాబే ముద్దనుకుంటున్న మాజీ మంత్రి..?