ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు

హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. తిరుమ‌ల కిషోర్‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. క్రేజీ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. దీంతో ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ‘ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయని సమాచారం. కేవలం నాన్ థియేట్రికల్ హక్కులే రూ.25 కోట్లకు హాట్ కేకుల్లా పోటీతో దక్కించుకున్నారని టాక్. సోనీ లివ్ సంస్థ డిజిటల్, శాటిలైట్ హక్కులను దక్కించుకోగా ఆడియో హక్కులను లహరి సంస్థ దక్కించుకుందని టాక్.

శర్వానంద్‌ను స‌రికొత్త కోణంలో ప్రెజంట్ చేస్తూ డైరెక్ట‌ర్ తిరుమ‌ల కిషోర్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా మలుస్తున్నారు. రీసెంట్‌గా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమాలో తొలి పాట విడుదలై మంచి ఆదరణను రాబట్టుకుంది. ఫిబ్రవరి 10న సినిమా టీజర్ విడుదలకు సిద్ధమవుతుంది.

ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి తది తరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్.

Previous articleనేను ల‌క్ ను న‌మ్మ‌ను క‌ష్టాన్ని నమ్ముతా – ఖిలాడీ ప్రీరిలీజ్‌వేడుక‌లో రవితేజ
Next articleగురుకులాలకు బాలయోగి పేరు తొలగించడంపై టిడిపి అభ్యంతరం