మా భూములు అన్యాక్రాంతం కానివ్వం ముస్లిం మైనారిటీ జేఏసీ దళిత జేఏసి అమరావతి నాయకుల ఆందోళన

ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూములను తనకా రిజిస్ట్రేషన్ చేసినందుకు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత జెఎసి కన్వీనర్ గడ్డం మార్టిన్ లూధర్ బాబు కో కన్వీనర్ చిలకా బసవయ్య మైనార్టీ జేఏసీ కన్వీనర్ షేక్ సాహెబ్ జాన్ మైనారిటి నాయకులు షేక్ మాబుసుబాని(కోకిల) కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలకా విజయ్ కుమార్ తదితరులు అమరావతి భూములు తనకా రిజిస్ట్రేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు మందడం గ్రామం లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు నిరసన నినాదాలు చేసి సబ్ రిజిస్టార్ మస్తాన్ వలి గారికి వినతి పత్రం అందించారు వారు మాట్లాడుతూ
9.14 అగ్రిమెంట్ ద్వారా సి ఆర్ డి ఎ రైతులు భాగస్వామ్యం తో ఉన్న భూములు ఏ విధంగా అక్రమంగా థర్డ్ పార్టీ కి భూములు రిజిస్ట్రేషన్ చేస్తుందో తెలియజేయాలి ప్రభుత్వం భూముల తనకా సొమ్మును అమరావతి రాజధానికి ఖర్చు చేస్తుందా లేదా జగన్మోహన్ రెడ్డి సొంత పథకాల కోసం ఖర్చు చేస్తుందా అనే అనుమానం వ్యక్తం చేశారు కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ అంశాలు కూడా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవటం కోర్టు ధిక్కరణ క్రిందికి వస్తుంది అని అన్నారు ఈ అంశంపై హైకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారు

Previous articleగురుకులాలకు బాలయోగి పేరు తొలగించడంపై టిడిపి అభ్యంతరం
Next articleఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ నిరుద్యోగ తెలుగుయువత